ETV Bharat / state

పీయూష్‌ గోయల్‌ ఇప్పుడు నూకలు తింటారేమో: కేటీఆర్‌ - Hyderabad Latest News

కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం విఫలమైందని చూపే ప్రయత్నంలో మోదీ సర్కారు తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. వివక్షతో తెలంగాణ ఆహార ధాన్యాలు కొనుగోలు చేయకుండా.. దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు. వన్‌ నేషన్‌ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అనుసరించాలని, రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కేటీఆర్‌
కేటీఆర్‌
author img

By

Published : Sep 10, 2022, 7:35 PM IST

తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోదీ సర్కారు తాను తీసుకున్న గోతిలో తానే పడిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించదన్నారు. ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

నాలుగేళ్లకు సరిపోయే నిల్వలు ఉన్నాయని గొప్పలు చెప్పారు: నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందన్నారు. ఇప్పటికే గోధుమలు, వాటి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోదీ సర్కార్.. తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందని మండిపడ్డారు.

ఎఫ్‌సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో స్పష్టమైన విధానం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ సర్కార్‌కు దీర్ఘకాలిక ప్రణాళిక కరవైందన్న సంగతి ఈ సంక్షోభంతో తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఉండడం ప్రజల దురదృష్టమని కేటీఆర్ ధ్వజమెత్తారు.

రాజకీయాలు పక్కనపెట్టి వివక్షలేని నిర్ణయాలు తీసుకోవాలి: తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్‌ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమోనని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటూ మోదీ సర్కారు కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులు వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు.

ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉందని కేటీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 12 నుంచి 15 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని.. అందుకే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందన్నారు. దేశానికి సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని కేటీఆర్ విమర్శించారు.

కేంద్రం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి వివక్ష లేని నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతకు ఢోకా లేకుండా చూడాలని పీయూష్ గోయల్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: 'సమైక్యతా దినం అనడంలో అర్థం లేదు.. విలీనంగా ప్రకటించాలి'

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.