ETV Bharat / state

కరోనా కట్టడి చేతగాకుంటే రాజీనామా చేయండి : కృష్ణసాగర్ - కృష్ణసాగర్ రావు

కరోనా సంక్షోభ సమయంలో కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని భాజపా రాష్ట్ర అధికార ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్​ రావు అన్నారు. హైకోర్టు హెచ్చరికలు చూస్తేనే ఆ విషయం స్పష్టమవుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించిందని ఆయన గుర్తు చేశారు. అయినా సీఎం కేసీఆర్ పాలన, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కట్టడి చేతగాకుంటే రాజీనామా చేయండి : భాజపా

author img

By

Published : Jul 21, 2020, 6:52 PM IST

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా సంక్షోభ సమయంలో కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని భాజపా రాష్ట్ర అధికార ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్​ రావు మండిపడ్డారు. ఇందుకు హైకోర్టు హెచ్చరికలే నిదర్శనమన్నారు. ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించిందని గుర్తు చేశారు. అయినా మేల్కోని తెరాస సర్కార్... ఎక్కడా కోర్టు హెచ్చరికలను పరిగణలోనికి తీసుకొని సమయత్తం అయినట్లు కనిపించలేదన్నారు.

'కోర్టు హెచ్చరికలు చూస్తేనే తెలుస్తోంది'...

హైకోర్టు మరోసారి రాష్ట్రంలో ఉన్నతాధికారులకు సమన్లు జారీచేసిందని కృష్ణసాగర్ పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంగా ఉన్న మిమ్మల్ని ఎందకు తొలగించకూడదో చెప్పాలంటూ యంత్రాంగాన్ని కోర్టు ప్రశ్నించిందని ఉదహరించారు. హైకోర్టు హెచ్చరికలు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉందో అర్థం అవుతోందన్నారు.

'వారిది 29, రాష్ట్రానిది 2 పేజీలా ?'

"బులిటెన్ విషయంలో ప్రభుత్వం అత్యంత క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కరోనా విళయతాండవం చేస్తోన్నా.. అదనంగా బెడ్లు పెంచుకోవడానికి చర్యలేవీ చేపట్టడం లేదు. తెలంగాణ హెల్త్ డిపార్ట్ మెంట్, కరోనా అప్​డేట్ చేసే వెబ్ సైట్ వారం రోజుల నుంచి డౌన్​మోడ్​లోనే ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు ఇచ్చే కరోనా బులిటెన్ 29 పేజీలు ఉంటే.. తెలంగాణ బులిటెన్ కేవలం రెండు పేజీలు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర బులిటెన్​లో ఎక్కడ సమగ్ర వివరాలు లేవు. జిల్లాల వారీగా వివరాలు చూపించకుండా తప్పించుకుంటోంది.

కొవిడ్ వ్యాప్తి కట్టడి.. కేసీఆర్ సర్కార్​కు చేతగాకపోతే... వెంటనే పదవులకు రాజీనామాలు చేయండి. తెరాస ప్రభుత్వం... మహమ్మారిని కట్టడి చేయడంలో చేతగాకుంటే మాతో సాధ్యం కాదని... కేంద్రానికి తెలియజేయండి. వైరస్ వ్యాప్తి చర్యలు కేంద్ర ప్రభుత్వమే చేపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం రివ్యూల పేరుతో కాలయాపన చేస్తూ... ప్రజారోగ్యంతో, ప్రజల బతుకులతో ఆటలాడుకుంటోంది. ఇప్పటికైనా తెరాస సర్కార్... మీ బాధ్యతలను గుర్తించి పనిచేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది."

-కృష్ణసాగర్ రావు, భాజపా రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి

కరోనా కట్టడి చేతగాకుంటే రాజీనామా చేయండి : భాజపా

ఇవీ చూడండి : కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.