ETV Bharat / state

KRMB: ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ.. అజెండాలో కీలకాంశాలు - కృష్ణాబోర్డు సమావేశం

krishna-river-management-board-meeting-on-27th-of-this-month

author img

By

Published : Aug 16, 2021, 5:32 PM IST

Updated : Aug 16, 2021, 6:12 PM IST

17:28 August 16

కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాపై చర్చించనున్న కేఆర్ఎంబీ

 రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంపకం సహా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే... రెండు రాష్ట్రాలకు నోటీసు ఇచ్చారు. 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ 14వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశ ప్రతిపాదిత ఎజెండాను నోటీసుతో పాటు జతపర్చారు.

నీటి వాటాలపై చర్చ

 ఇప్పటి వరకు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాత్కాలికంగా 66, 34 నిష్పత్తిలో వినియోగించుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి చెరిసగం నీటిని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. దీంతో 2021-22 సంవత్సరంలో కృష్ణ జలాల వినియోగంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తమ వాటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. బోర్డు సూచనలతో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ అంశంపై సమావేశంలో మరోమారు చర్చ జరగనుంది. 

ఫిర్యాదులపై చర్చ

 ఇటీవల ప్రాజెక్టులు నిండినపుడు రెండు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. అందుకు ఉపయోగించిన నీటిని లెక్కల్లోకి తీసుకురావాలా వద్దా అన్న విషయమై చర్చించనున్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బోర్డు పరిధి, నిర్వహణ, అమలు కార్యాచరణ, సంబంధిత అంశాలపై బోర్డులో చర్చిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్నెళ్లలో అనుమతులు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. జూన్ నెలలో శ్రీశైలం సహా ఇతర చోట్ల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణను కోరింది. ఆ అంశాలపై కూడా భేటీలో చర్చించనున్నారు. చిన్ననీటి వనరులకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ మొత్తాన్ని తెలంగాణ వినియోగించుకుంటోందని ఆంధ్రప్రదేశ్ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది.  

బోర్డు తరలింపుపై చర్చ

 గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీలు అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు విశాఖపట్నానికి తరలింపు అంశాలపై కూడా చర్చించనున్నారు. విశాఖలో అద్దెకు బోర్డు కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం భవనం ఇవ్వకపోవడంతో ఏడాదికి కోటి రూపాయల ఖర్చుతో అద్దె భవనాన్ని తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇది బోర్డుపై ఆర్థికభారం పడుతుందని అంటున్నారు. వీటితో పాటు బోర్డులో ఖాళీల భర్తీ, బోర్డుకు రెండు రాష్ట్రాల నుంచి నిధులు ఇచ్చే విషయమై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని: కృష్ణా బోర్డు

Last Updated : Aug 16, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.