చెన్నైకి తాగునీటి సరఫరా విషయమై కృష్ణానదీ యాజమాన్య బోర్డు.. నేడు సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం... ఆయా రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు సమాచారం అందించారు. ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు... 5 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను ఇవ్వాల్సి ఉంటుంది.
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదల చేసిన జలాలతో పాటు చెన్నై అవసరాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం