తెలంగాణకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ మే నెల వరకు తాగునీటి అవసరాలతో పాటు సాగర్ ఆయకట్టు కోసం 17 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర రావు లేఖ రాశారు. ఏపీ లేఖ నేపథ్యంలో కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్ మీనా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ 17 టీఎంసీల నీరు కోరినందున తెలంగాణ నీటి అవసరాలు ఉంటే వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖను కూడా జతపరిచారు.ఇవీ చూడండి:ఓటింగ్‌లో పాల్గొనవద్దు