రాష్ట్ర టెస్కాబ్ ఛైర్మన్‌గా రవీందర్‌రావు, వైస్ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో టెస్కాబ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మినహా
అభ్యర్థులు నామినేషన్ దాఖలు, పరిశీలన అనంతరం ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన టెస్కాబ్ పాలకవర్గం అధ్యక్ష, ఉపాధ్యక్షులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మినహా... మిగతా 904 సహకార సంఘాలకు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు.
రైతులకు మరింత చేరువై
టెస్కాబ్‌లో ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి, మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనలు, సలహాలతో మరింత సమర్థవంతంగా పనిచేసి రైతులకు మరింత చేరువై సేవలు అందిస్తామని ఆ సంస్థ నూతన ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు.
ఆరోపణలు
సహకార స్ఫూర్తి కొరవడిందన్న విమర్శల నేపథ్యంలో టెస్కాబ్ పాలకవర్గం ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్షేత్ర స్థాయిలో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు, సంస్థాగత రుణాలందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
2015 ఏప్రిల్ 2న టెస్కాబ్ మూల ధనం రూ.101.98 కోట్లు ఉంటే.. 2020 ఫిబ్రవరి 29 నాటికి రూ.169.50 కోట్లకు చేరింది. నిల్వలు 526.97 కోట్లు, డిపాజిట్లు 4227.27 కోట్లుగా ఉన్నాయి. ఇచ్చిన అప్పులు రూ.3158.04 కోట్లు, కాల్ మనీ, ఎస్టీ డిపాజిట్లు రూ.1209 కోట్లుగా ఉన్నాయి. పెట్టుబడులు 1022.21 కోట్ల చొప్పున ఉండగా.. అడ్వాన్సులు రూ.5873.97 కోట్లు, వ్యాపార లావాదేవీలు 1010.24 కోట్లుగా నమోదైంది.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు