ETV Bharat / state

Kishan Reddy on Home Guards Issues : 'ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలి' - రవీందర్‌కు మద్దతుగా హోంగార్డు నాగమణి వీడియో

Kishan Reddy on Home Guards Issues : హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బాధితుడిని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడి జరుగుతోందని విమర్శించారు.

Kishan Reddy on Home Guard System
Hyderabad Home Guard Suicide Update
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 3:35 PM IST

Updated : Sep 7, 2023, 4:14 PM IST

Kishan Reddy on Home Guards Issues : హైదరాబాద్‌లోని గోషామహల్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్‌ను (Home Guard Ravinder).. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎటువంటి రాజకీయాలకు పాల్పడకుండా అతనికి న్యాయం చేయాలని కిషన్‌రెడ్డి తెలిపారు. హోంగార్డులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని.. ఆ వ్యవస్థలో వారి శ్రమ దోపిడీ జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Home Guard Ravinder Health Condition : హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని అన్నారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. వారిని రెగ్యులర్‌ చేస్తామని కేసీఆర్‌ శాసనసభలో హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

Miyapur Gun Fire Incident Solved : ఉద్యోగం పోయిందనే కోపంతో.. ఉసురు తీశాడు

Kishan Reddy on Home Guard Suicide Attempt : హోంగార్డు కుటుంబసభ్యులు జీతాలు లేక రోడ్డున పడుతున్నారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారని.. పోలీసు వ్యవస్థలో సైతం వారికి అవమానం జరుగుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేద్దామని.. పార్టీ తరఫున రవీందర్‌కు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

"హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరం. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడి జరుగుతోంది. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోంది. హోంగార్డులు కొన్నిసార్లు 16 గంటలు పనిచేస్తున్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలి. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి. హోంగార్డులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Other Home Guards Supported Ravinder : హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నంపై.. మిగతా హోంగార్డులు స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అతనికి మద్దతు తెలుపుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన నాగమణి అనే హోంగార్డు సైతం సోషల్ మీడియాలో.. రవీందర్‌కు మద్దతుగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. రవీందర్‌ పడుతున్న బాధనే.. రాష్ట్రంలోని మిగతా హోంగార్డులు ఎదుర్కొంటున్నారని నాగమణి పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన ఆమె బాన్సువాడలో విధులు నిర్వహిస్తున్నారు.

Kishan Reddy Khammam District Tour : 'కాంగ్రెస్, బీఆర్​ఎస్ పాలన చూశాం.. బీజేపీకి అవకాశం ఇవ్వండి'

తన భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నా కనీసం సెలవులు లేక.. తన తల్లి ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని నాగమణి తెలిపారు. తామున్నా చూసుకోలేని పరిస్థితిలో పిల్లలను నగరంలోనే హస్టల్‌లో ఉంచాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను రెగ్యులర్‌ చెయ్యాలని.. ఇతర ప్రయోజనాలు అందించాలని హోంగార్డులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Hyderabad Home Guard Suicide Update : జీతం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డు.. పరిస్థితి విషమం

49 ఏళ్ల ఏజ్​లో హోంగార్డ్ ఉద్యోగం.. అపాయింట్​మెంట్ లెటర్ కోసం 14 సంవత్సరాలు వేచి చూస్తే..

Last Updated : Sep 7, 2023, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.