కేంద్ర ప్రభుత్వం నాలుగు సంస్కరణలు తీసుకువచ్చిందని... రాష్ట్రంలో మూడు సంస్కరణలు అమలు చేసినా నిధులు తెచ్చుకోవచ్చని హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. రుణాలు తెచ్చుకోవడానికి కేంద్రం చిన్న నిబంధనలు పెట్టిందని తెలిపారు. భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదని చెప్పారు. భిక్షం వేయడానికి కేంద్రం వద్ద డబ్బులుండాలి కదా అని మండిపడ్డారు. సమస్యలపై లేవనెత్తుతున్న ప్రతి అంశానికి జవాబు చెబుతామని స్పష్టం చేశారు.
విద్యుత్ అంతా ఒకే గ్రిడ్ కిందకు వచ్చినపుడు సంస్కరణలు తప్పనిసరని వెల్లడించారు. ఒక రాష్ట్రం సంస్కరణలు చేసి.. మరొకటి చేయకపోతే ప్రజలే నష్టపోతారని వివరించారు.
ఇదీ చూడండి: కేసీఆర్..నీ భాష మార్చుకో....: కిషన్రెడ్డి