ETV Bharat / state

పార్టీలకు అతీతంగా భాజపాలో చేరండి: కిషన్​ రెడ్డి - BJP Member ship

నాంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుకున్నారు.

kishanreddy
author img

By

Published : Jul 6, 2019, 5:32 PM IST

సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత మెుదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీలను సందర్శించారు. తనను గెలింపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బస్తీ వద్ద గత 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల కోసం మినిస్టర్ క్వార్టర్స్​లో ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేశానని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా అక్కడికి వచ్చి చెప్పవచ్చని సూచించారు.

ఈరోజు హైదరాబాద్​లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ భాజపాలో చేరాలని కిషన్​ రెడ్డి సూచించారు.

పార్టీలకు అతీతంగా భాజపాలో చేరండి: కిషన్​ రెడ్డి

ఇవీ చూడండి;రాజ్యసభకు జైశంకర్​, జుగల్ ఠాకూర్​ ఎన్నిక

Intro:నాంపల్లి కాన్స్టెన్సీ ని సందర్శించిన కిషన్ రెడ్డి

Body:నాంపల్లి కాన్స్టెన్సీ ని సందర్శించిన కిషన్ రెడ్డి

Conclusion:హైదరాబాద్: సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచిన తరువాత తనను గెలిపించిన నాంపల్లి కాన్స్టెన్సీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు...
mangar బస్తీ వద్ద గత 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకొని వారికి ఉన్న ఇంటి సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు...
కిషన్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ వారికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మినిస్టర్ క్వార్టర్స్ లో వారికోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేశానని ఎలాంటి సమస్య ఉన్నా అక్కడికి వచ్చి చెప్పవచ్చును ప్రజలకు తెలిపారు.
బైట్: కిషన్ రెడ్డి (సెంట్రల్ మినిస్టర్)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.