Kishan Reddy Mediagdda Barrage Issue : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసిందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై కేంద్రానికి లేఖ రాసిన వెంటనే ఉన్నతస్థాయి కమిటీ వచ్చి పరిశీలించిందని గుర్తు చేశారు. ఘటనపై మరింత విశ్లేషణ చేయాలని, 20 అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరినా, ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Kishan Reddy Fires On Ex CM KCR : "కట్టిన మూడు, నాలుగేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఇది కేసీఆర్ సర్కారు అవినీతికి అద్దం పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. అవినీతికి కాంగ్రెస్‌కు విడదీయలేని బంధం ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి పట్ల హస్తం పార్టీకి సానుభూతి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే అనే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. కాళేశ్వరం అవినీతిపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు అదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సీబీఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదో రేవంత్ రెడ్డి చెప్పాలి" అని కిషన్ రెడ్డి నిలదీశారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌తో గెలుస్తాం : కిషన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. హస్తం పార్టీ ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్తో అవగాహనకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటి కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు.
'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'
"బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలి. గత ప్రభుత్వం కేసీఆర్‌ను అపర భగీరథుడిగా కీర్తించింది. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజినీర్ అని ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై కేంద్రానికి లేఖ రాస్తే, వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వచ్చి మేడిగడ్డను పరిశీలించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరికొన్ని వివరాలు కోరితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసురుతున్నా. కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy On PSLV C58 Launch : మరోవైపు అంతరిక్ష రంగంలో నూతన ప్రయోగాలకు జనవరి 1 వేదికైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేపట్టిన ప్రయోగం విజయవంతం అయిందని తెలిపారు. అమెరికా తర్వాత ఇస్రో ఈ తరహా ప్రయోగాలకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలి : కిషన్ రెడ్డి