Kishan Reddy Fires on Congress Praja Palana : అభయహస్తం దరఖాస్తు ఫారాలు (Congress Abhaya Hastham) ప్రజలను అయోమానికి గురిచేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన అర్జీలు బయట అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది ఆరు గ్యారంటీల అమలును ఆలస్యం చేసే ప్రక్రియ అని విమర్శించారు. రేషన్ కార్డు లేకుండా ఎలా పథకాలు ఇస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
Praja Palana Program in Telangana : అభయ హస్తం దరఖాస్తు ఫారం వెనక ఉన్న మతలబు అర్థం కావట్లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ దృక్పథంతోనే అభయహస్తం ఫారం ఉందని, ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని ఆరోపించారు. అర్జీలు అవసరం లేకుండా హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, మరి రేషన్ కార్డు లేకుండానే జత చేయాలని కాంగ్రెస్ చెబుతోందని ఇది ఏ రకంగా సమంజమని ప్రశ్నించారు. పథకాల అమలు జాప్యం చేసేందుకే హస్తం పార్టీ అభయహస్తం నాటకమని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.
"అభయహస్తం దరఖాస్తు ఫారాలు ప్రజలను అయోమానికి గురిచేస్తున్నాయి. అభయహస్తం దరఖాస్తులు బయట అమ్ముతున్నారు. ఇది ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం చేసే ప్రక్రియ. రేషన్ కార్డు లేకుండా ఎలా పథకాలు ఇస్తారు. రాజకీయ దృక్పథంతోనే అభయహస్తం ఫారం ఉంది. అభయహస్తం దరఖాస్తు ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఆ పది లోక్సభ స్థానాలపైనే బీజేపీ స్పెషల్ ఫోకస్
Kishan Reddy on Ayodhya Ram Mandir Opening : మరోవైపు అయోధ్య రామ్ మందిర్ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి కిషన్ రెడ్డి మాట్లాడారు. 'అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నం. బానిస మనస్తత్వం నుంచి బయటపడేసే దేవాలయం అయోధ్య. రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛత అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నాం.శ్రమదానం ద్వారా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం. ఈ నెల 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ లైవ్ ఇస్తాం. అయోధ్య కార్యక్రమం తిలకించేలా జనవరి 22న అన్ని ఆలయాల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని' కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
అయోధ్య కార్యక్రమం తిలకించేలా జనవరి 22న అన్ని ఆలయాల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత అన్ని ఆలయాల్లో దీపారాధన, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈనెల 22 సాయంత్రం ప్రతి హిందువు ఇంటిముందు పచ్చతోరణాలు, ముగ్గులతో అలంకరించాలని కోరారు. ఐదు రామజ్యోతులు వెలిగించుకునేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి
'కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి - ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించడం ఏంటి'