తెలంగాణాలో ప్రభుత్వ భూములను వేలం వేయాలన్న రహస్య అజెండాతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం భూముల వేలాన్ని ఆపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డితో కలిసి ఆయన లేఖ రాశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా భూములను వేలం వేస్తుంటే తాము అడ్డుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మారని చెప్తూ... ఆనాడు కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజా అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఈ అవసరాలకే ఉపయోగించాల్సి ఉంటుందని కోదండ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్