ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఖైరతాబాద్ రవాణా శాఖకు కాసుల పంట పడింది. సోమవారం ఒక్కరోజే రూ. 30,55,748 ఆదాయం సమకూరింది. అత్యధికంగా టీఎస్ 09 ఎఫ్.ఇ.9999 నంబర్ గల టయోట ల్యాండ్ క్రూసర్ వాహనం వల్ల రూ. 10 లక్షలు, టీఎస్ 09 ఎఫ్.ఎఫ్ 0001 నంబర్ గల లెక్సస్ ఎల్.ఎక్స్ వాహనం రూ.6.95లక్షలు, టీఎస్ 09 ఎఫ్.ఎఫ్ 0099 నంబర్ గల ఆడీ కారుతో రూ.2.78 లక్షలు వచ్చినట్లు ఖైరతాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి పాండు రంగానాయక్ తెలిపారు.
ఇదీ చదవండి : రూ. 8 కోట్లపై ఈసీని వివరణ కోరిన హైకోర్టు