ETV Bharat / state

Khammam Congress MLA Tickets Disputes : ఖమ్మం జిల్లాలో ఆధిపత్యపోరు.. టికెట్ల వేటలో కాంగ్రెస్ ముఖ్యులు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 11:09 AM IST

Khammam Congress MLA Tickets Disputes : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఆశావహులకు టికెట్ల గుబులు పట్టుకుంది. రెండో జాబితా ఇవాళే ప్రకటిస్తారన్న ప్రచారం మళ్లీ తెరపైకి రావడంతో.. ఆశావహులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండింటింకి మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించగా.. మిగిలిన 8చోట్ల ఎవరి చేతికి అందుతాయనే అంశం చర్చనీయంగా మారింది. ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు బరిలో పొంగులేటి దిగడం దాదాపు ఖాయమైనందున మిగిలిన 6 నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Congress Khammam MLA Tickets Issue
Khammam Congress MLA Tickets Disputes

Khammam Congress MLA Tickets Disputes ఖమ్మం జిల్లాలో ఆధిపత్యపోరు.. టికెట్ల వేటలో కాంగ్రెస్ ముఖ్యులు

Khammam Congress MLA Tickets Disputes : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తొలి దఫాలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. సిట్టింగు స్థానాలైన మధిర, భద్రాచలం నియోజకవర్గాల నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పొదెం వీరయ్యల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. రెండో జాబితా రేపోమాపో అంటూ ప్రకటనలు వస్తుండటంతో ఆశావహులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

Congress Khammam MLA Tickets Issue : దఫదఫాలుగా హస్తినలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. ఇవాళ రెండో జాబితా వెలువడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఉమ్మడి జిల్లాలో 8 స్థానాల్లో రేసు గుర్రాలెవరో తేలనుంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి బరిలో దిగడం ఖాయమన్న ప్రచారం ఉంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్థుల లెక్కలు తేలాల్సి ఉంది.

T Congress Party Public Meeting on October 31st : ఈనెల 31న కొల్లాపూర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ.. 28 నుంచి రెండో విడత బస్సుయాత్ర..!

ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరేసి ఆశావాహుల అభ్యర్థుల పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీకి చేరినప్పటికీ.. మిగిలిన వారు సైతం సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఏకంగా ఐదుగురు ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇల్లందు, పినపాక, అశ్వారావుపేటలోనూ టికెట్ పోరు తారస్థాయికి చేరింది. కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లోనూ ఆశావహులు పోటాపోటీగా ఉండగా.. కమ్యూనిస్టులతో పొత్తులు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎసరు పెట్టేలా ఉన్నాయన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలతో టికెట్ ఆశిస్తున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీపీఐకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా నుంచే సీపీఎంకు ఒక స్థానం ఇవ్వాల్సి వస్తుండటంతో ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరి సీటు గల్లంతవుతుందోనన్న బెంగ కాంగ్రెస్ ఆశావహుల్ని వెంటాడుతోంది.

Congress Focus on Khammam MLA Tickets : పలు నియోజకవర్గాల్లో టికెట్ల పోరు ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని ముఖ్యనేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధానంగా వైరా, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆశావహ అభ్యర్థుల కన్నా ముఖ్యనేతల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి తన అనుచరులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.

వైరాలో రాందాస్‌నాయక్, బాలాజీనాయక్‌లకో ఒకరి కోసం భట్టి పట్టుబడుతుంటే..విజయాభాయికి ఇవ్వాల్సిందేనని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. వైరా స్థానం సీపీఎంకు కేటాయిస్తారన్న ప్రచారం సాగినప్పటికీ.. ఆ పార్టీ మొగ్గుచూపకపోవడంతో కాంగ్రెస్ లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లిలో టికెట్ పోరు రసకందాయంలో పడింది. మట్టాదయానంద్ దంపతుల కోసం రేణుకాచౌదరి, కొండూరి సుధాకర్ కోసం పొంగులేటి ఎవరికి వారు వెనక్కి తగ్గడం లేదు.

Telangana Congress Candidates Selection 2023 : 64 సీట్లపై తర్జన భర్జన.. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రతిష్ఠంభన!

Telangana Congress MLA Ticket Issues 2023 : ఇదే సమయంలో సామాజిక సమీకణాల నేపథ్యంలో సత్తుపల్లి మాదిగలకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. 45 ఏళ్లుగా మాదిగలకు అన్యాయం జరుగుతున్నందున ఈసారి సత్తుపల్లి స్థానం మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని.. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్న కుటుంబానికి చెందిన తనకు టికెట్ ఇవ్వాలంటూ పార్టీ రాష్ట్ర నాయకులు.. ఏఐసీసీ అగ్రనేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇల్లందులో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కోసం పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయనకు టికెట్ ఇస్తే తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని ఆశావహ అభ్యర్థులు ప్రకటించడంతో టికెట్ పోరు ఆసక్తి కరంగా మారింది. అశ్వారావుపేటలో ఆదినారాయణ కోసం పొంగులేటి, సున్నం నాగమణి కోసం భట్టి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తుమ్మల ఆశీస్సులతో తాటి వెంకటేశ్వర్లు సైతం టికెట్ ఆశిస్తున్నారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు కోసం పొంగులేటి పట్టుబడుతుండగా..ఇక్కడ పోలెబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయగాంధీ ఆశావహులుగా ఉన్నారు. దీంతో.. అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సాములా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో జాబితాలోనైనా అభ్యర్థుల లెక్కలు తేలుతాయా లేదా అన్నది కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

Telangana Congress MLA Candidates List 2023 : కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ మలి విడత అభ్యర్థుల ఎంపిక.. ఇవాళ ఆమోద ముద్ర!

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల జోరు.. పోటాపోటీగా ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.