అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇదే నినాదంతో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పలు డివిజన్ల తెరాస అభ్యర్థుల తరపున దానం వెంటరాగా... ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
1500 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు ముందుకు రాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 150 మంది అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు. వారి గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. వరద బాధితులకు 10వేల రూపాయలు ఇవ్వకుండా అడ్డుకున్న భాజపా నాయకుల తీరుపై ప్రజలకు వివరిస్తామని దానం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి : సేవా కార్యక్రమాలు చేస్తున్నా.. టికెట్ కేటాయించలేదని అసమ్మతి