Khairatabad SI stopped the moving vehicle: రహదారి మొత్తం వాహనాలతో రద్దీగా ఉంది. అప్పుడే ఒక వాహనం కొంత మంది ప్రయాణికులను తీసుకొని ఆ రోడ్డుపై వెళ్తోంది. పైగా ఫ్లై ఓవర్ కావడంతో కొద్దిగా స్పీడ్‌గానే వెళ్తోంది. ప్లై ఓవర్ దాటి కిందకి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చింది. వాహనం అటూ ఇటూ కదులుతూ రోడ్డు మొత్తం తిరుగుతోంది. ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఇవే చివరి క్షణాలు అనే విధంగా వారు భయందోళనకు గురవుతున్నారు.
అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకుందమంటే వారికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పక్కకు దూకితే ప్లై ఓవర్.. వెనుక నుంచి దూకితే వాహనాలు రద్దీ.. అయోమయంలో పడ్డారు. డ్రైవర్ దగ్గరి వెళ్లి ఆ బ్రేక్, స్టీరింగ్ పట్టి అదుపు చెద్దామంటే.. డ్రైవర్ దగ్గరకు వెళ్లే దారి లేకుండా ఆ వాహనం ఉంది. అప్పుడే హీరోలా ఎంటర్ అయ్యాడు అందులో ఉన్న వ్యక్తి.. వాహనం వెనుక నుంచి దూకి.. వాహన వేగాన్ని అందుకొని మరి బ్రేక్ వేసి సుమారు 25 మంది ప్రాణాలు కాపాడాడు. సినిమా తరహాలో చోటుచేసుకున్న ఈ ఘటన మన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ఇందులో రియల్ హీరో ఎవరో తెలుసా.. ఒక పోలీస్ సబ్ఇన్స్పెక్టర్.
ఇదీ జరిగింది: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ రాష్ట్ర ఏబీవీపీ కార్యకర్తలు నిన్న ప్రగతి భవన్ ముట్టడి చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. కాపలాగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్ రెడ్డి, కొందరు పోలీసులు వ్యాన్‌లో వెళ్లారు. డీసీఎం వ్యాన్ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దిగి నెక్లెస్‌రోడ్డు వైపు వస్తుండగా.. వ్యాన్ డ్రైవర్ రమేశ్‌కు సడన్‌గా ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి అటూ ఇటూ తిరుగుతోంది. దీనిని గమనించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి.. వెంటనే నడుస్తున్న వాహనం నుంచి కిందకు దూకేశారు.
అదే స్పీడ్‌లో వ్యాను ముందుకు పరుగు తీశారు. డోర్ తీసి, స్టీరింగ్ పట్టుకోవడం, వెంటనే బ్రేక్ వేయడంతో పూల కుండిని ఢీ కొట్టి పెద్ద కుదుపుతో వ్యాన్ ఆగింది. ప్రమాద సమయంలో అందులో 16మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థాలానికి చేరుకొని వాహనాన్ని తొలగించి, అరెస్టు చేసిన వారిని మరో వాహనంలో తీసుకెళ్లారు. ప్రమాదంలో ఎస్సైతో పాటు హోంగార్డు రమేష్, మరో కానిస్టేబుల్‌కు గాయాలవ్వగా.. వారు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి:
చిన్నపాపను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన బస్సు.. 19 మందికి గాయాలు
ములుగు జిల్లాలో మిస్టరీ మర్డర్.. మేడారం వన దేవతల పూజారి దారుణ హత్య
క్రికెట్, పుట్‌బాల్ ఆడుతున్న ఏనుగు.. స్నానం కూడా సొంతంగానే