ETV Bharat / state

ప్రభుత్వ అధికారులపై కోపం లేదు: ఎమ్మెల్యే దానం - ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజా సమాచారం

షేక్‌పేట్‌ ఎమ్మార్వో బదిలీ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వాధికారులపై తమకు ఎలాంటి కోపం లేదని ఆయన స్పష్టం చేశారు.

khairatabad mla danam nagender reddy says  there is no such anger against government officials
ప్రభుత్వ అధికారులపై కోపం లేదు: ఎమ్మెల్యే దానం
author img

By

Published : Feb 15, 2021, 4:30 PM IST

ప్రభుత్వాధికారులపై తమకు ఎలాంటి కోపం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం కార్పోరేటర్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పట్ల షేక్‌పేట్‌ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ ప్రస్తుత మేయర్‌ గద్వాల విజయలక్ష్మి జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌గా ఉన్న సమయంలో ఆ ప్రాంత సమస్యలు చెప్పడానికి వెళ్లిన క్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పట్టించుకోలేదని ఎమ్మెల్యే దానం ఆక్షేపించారు. ప్రజలు ఇబ్బందిపడుతున్నారని నిలదీయడంతో సదురు ఎమ్మార్వో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.