ETV Bharat / state

KCR Kit Scheme Telangana : కేసీఆర్ 'కిట్టు' హిట్టు.. లబ్దిదారులకు నగదు అందితే ఒట్టు!

KCR Kit Scheme Telangana : కేసీఆర్‌ కిట్‌.. పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు, సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. అయితే ఇీటవలి కాలంలో ఈ స్కీమ్‌ లక్ష్యం గాడి తప్పుతోంది. కేసీఆర్ కిట్‌తో పాటు లబ్దిదారులకు అందాల్సిన నగదు సాయం అందడం లేదు. గత రెండేళ్లుగా కిట్లు అందిస్తున్నా.. తల్లుల ఖాతాల్లో డబ్బులు మాత్రం పడటం లేదు.

KCR kit beneficiaries Waiting for Cash assistance
KCR Kit Scheme Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 10:22 AM IST

KCR Kit Scheme Telangana : రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దవాఖానాల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు, మెరుగైన వైద్య సేవలు ఇందుకు ఓ కారణమైతే.. ప్రభుత్వం అందించే కేసీఆర్‌ కిట్‌, నగదు ప్రోత్సాహం మరో కారణమని చెప్పొచ్చు. అయితే గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో ప్రసవించే మహిళలకు కేసీఆర్‌ కిట్‌ క్రమం తప్పకుండా అందజేస్తున్నా.. తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు మాత్రం అందడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఎంతోమంది లబ్దిదారులు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

KCR Kit Cash Assistance Telangana 2023 : ప్రసవం సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అయ్యే వైద్య ఖర్చులు.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కఠినంగా మారాయి. డబ్బులు లేక కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు, సరైన సమయంలో వైద్యం అందక బాలింతలు, నవజాత శిశువులు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకానికి శ్రీకారం చుట్టింది.

కేసీఆర్‌ కిట్‌లో ఈ పిల్లల పౌడర్‌ను ఉంచాలా, వద్దా

KCR Kit Beneficiaries Waiting for Cash Assistance : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2017లో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. గర్భం దాల్చిన మహిళలకు ప్రసవమై.. శిశువు పది నెలల వయసు వచ్చే వరకు సంరక్షణ చర్యలు చేపట్టడం పథకం ముఖ్య ఉద్దేశం. గర్భం దాల్చిన మహిళ ప్రసవించే సమయానికి మొత్తం 4 విడతల్లో కలిపి రూ.12 వేల నగదు, పురుడు పోసుకున్న రోజు కేసీఆర్‌ కిట్‌ (నవ జాత శిశువుకు అవసరమైన సబ్బులు, ఓ దోమ తెర, నూనెలు, రెండు బేబీ డ్రెస్సులు, చిన్న పరుపు, 2 టవళ్లు, తల్లికి 2 చీరలు,) అందిస్తోంది. ఆడబిడ్డ పుడితే మరో రూ.1000 అదనంగా (మొత్తం రూ.13 వేలు) తల్లి ఖాతాల్లో జమ చేస్తోంది.

కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

కిట్లు సరే.. నగదు ఏది..? ప్రభుత్వం అందిస్తోన్న ఈ ప్రోత్సాహంతో పేదలకు సర్కార్‌ దవాఖానాలపై నమ్మకం కుదిరింది. పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమక్రమంగా ప్రసవాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు ఇక్కడ సిజేరియన్‌లకు బదులు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు మాని.. గవర్నమెంట్‌ దవాఖానాలకు క్యూ కడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ కిట్ లక్ష్యం గాడి తప్పుతోంది. దాదాపు గత రెండేళ్లుగా కిట్లు మినహా.. గర్భిణులకు నగదు ప్రోత్సాహకం అందడం లేదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వారంతా.. డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

నిధులు రాగానే ఖాతాల్లోకి..: ఇదిలా ఉండగా.. గర్భం దాల్చిన నాటి నుంచి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల వివరాలను వెంటవెంటనే ప్రభుత్వానికి నివేదిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో పెండింగ్‌ చూపుతున్నాయని.. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని స్పష్టం చేస్తున్నారు.

గర్భిణీలకు 'కేసీఆర్‌ పౌష్టికాహార కిట్​'.. వచ్చే వారమే శ్రీకారం..

'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.