ETV Bharat / state

నేడు దిల్లీ మద్యం కేసులో.. విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Kavitha To Attend Trial In Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఉదయం ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. వాస్తవంగా గురువారమే విచారణకు హాజరుకావాల్సి ఉండగా 11న వస్తానని కవిత ఈడీని కోరారు. కవితను నేడు ఈడీ విచారించనున్న వేళ..కేటీఆర్​, హరీశ్ రావు సహా పలువురు మంత్రులు దిల్లీ వెళ్లారు.

author img

By

Published : Mar 11, 2023, 7:25 AM IST

mlc kavitha
mlc kavitha

Kavitha To Attend Trial In Delhi Liquor Case: ఈ మధ్య కాలంలో దిల్లీ మద్యం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్ట్​ చేసిన ఈడీ.. తాజాగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 8 నోటీసులు జారీ చేసింది. అయితే కొన్ని కార్యకలాపాల వల్ల విచారణకు 11వ తేదీన వస్తానని కవిత ఈడీని కోరింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దిల్లీ అక్రమ మద్యం కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం 10.30 తర్వాత ఆమెను విచారించి.. పలు విషయాలను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈనెల 9నే విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున 9వ తేదీ విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ కవిత రాశారు.

ఈనెల 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవితను.. ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ప్రశ్నించనున్న తరుణంలో మంత్రులు కేటీఆర్​, హరీశ్ రావు మొదలైన వారు హుటాహుటిన దిల్లీ వెళ్లారు. ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్​, హరీశ్ రావు దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు దిల్లీ చేరుకోగా.. మరికొందరు బీఆర్​ఎస్​ నేతలు ఈ ఉదయం దిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.

Delhi Liquor Case Updates: తాను కవితకి బినామీ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై.. దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

కవితను అరెస్ట్​ చేస్తారంటా చేయనివ్వండి: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు సీఎం కేసీఆర్​ అండగా నిలిచారు. శుక్రవారం జరిగిన బీఆర్​ఎస్​ పార్టీ మీటింగ్​లో కవితను ఈడీ పేరుతో వేధిస్తున్నారని సీఎం కేసీఆర్​ అన్నారు. కవితను అరెస్ట్​ చేస్తారంటా.. చేయనివ్వండి.. భయపడే ప్రసక్తే లేదు. ఏం చేస్తారో చూద్దామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు నుంచి చివరకు కవిత వరకు వచ్చారు. నోటీసుల పేరుతో వేధిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.