MLC Kavita in Delhi Liquor Case Update: దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ మద్యం కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. వారిని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా వెల్లడించారు. తాను వేసిన పిటిషన్ ఈనెల 24న విచారణకు రానుందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఈడీ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న వ్యక్తి గతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ వెల్లడించింది.
-
గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2023గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2023
Kavita in Delhi Liquor Case: ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు కవితన విచారించిన విషయం విధితమే. అయితే ఈనెల 16న విచారణకు హాజరవ్వాలని అదే రోజున నోటీసులు జారీ చేశారు. తాను హాజరుకాలేనని ఈడీకి ఈ మెయిల్ ద్వారా కవిత లేఖను పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.
వారు అడిగిన పత్రాలను న్యాయవాది ద్వారా ఆమె పంపించారు. ఈడీకి మరో లేఖ రాస్తూ.. ఆడియో, వీడియో విచారణకైన ఆమె సిద్ధమని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చన్నారు. తన ప్రతినిధిగా న్యాయవాది భరత్‌ను ఈడీకి పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరో తేదీని ఖరారు చేస్తూ.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.తెలంగ
లిక్కర్ స్కామ్‌లో కవిత: ఈనెల 11న ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆ రోజు ఈడీ అధికారులు కవితను 8 గంటల పాటు ప్రశ్నించారు. వాస్తవానికి ఈనెల 9నే కవిత విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ముందస్తు కార్యక్రమాల ఉండటంతో, 11న హాజరవుతానని ఆమె దర్యాప్తు సంస్థకు సమాచారమిచ్చారు.
చెప్పినట్టుగానే కవిత ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 4 గంటలు వరకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. ఓ గంట విరామం తర్వాత 5 గంటలకు మళ్లీ విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: