హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ తెరాస పార్టీ అభ్యర్థి లాస్య నందితకు మద్దతుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని అన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవాడిగూడ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: రెండు పడక గదుల ఇళ్ల కోసం కొట్లాడుతా: వెల్డండ వెంకటేశ్