ETV Bharat / state

కత్తి మహేశ్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల సంతాపం...

author img

By

Published : Jul 11, 2021, 9:31 AM IST

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కత్తి మహేశ్‌ మరణ వార్తతో షాక్‌ అయ్యానని సినీ నటుడు మంచు మనోజ్‌ అన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు తన స్వగ్రామంలో జరుగనున్నాయి.

కత్తి మహేశ్‌ పట్ల పలువురు సినీ ప్రముఖుల సంతాపం

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కత్తిమహేశ్‌ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

కత్తి మహేశ్‌ మరణ వార్తతో షాక్‌ అయ్యా!

కత్తి మహేశ్‌ మరణ వార్త తనను షాక్‌కు, ఆవేదనకు గురిచేసిందని సినీ నటుడు మంచు మనోజ్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మహేశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

నేడు తన స్వగ్రామంలో అంత్యక్రియలు

ఆయన అంత్యక్రియలు నేడు తన స్వగ్రామంలో జరుగనున్నాయి. చిత్తూరు జిల్లా యర్రావారిపాలెంలోని యలమందలో కత్తిమహేశ్‌ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి: KATHI MAHESH: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.