Karthika Masam 2023 : తెలంగాణలో కార్తికశోభ (Karthika Masam 2023 ) వెల్లివిరిస్తోంది. కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాయి. శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగాయి. వేకువజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కార్తికమాసం స్పెషల్ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!
Karthika Somavaram Special Puja in Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి తీరం జన సందోహంగా మారింది. నదిలో మహిళలు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలను నీటిలో వదిలారు. అనంతరం నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మహిళలు భారీగా హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉపవాస దీక్షలు, అభిషేకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. వేకువ జామున నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు.. పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకొని.. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సైకత లింగాలను ఏర్పాటు చేశారు. గోదావరి నదికి దీపాలు సమర్పించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు జరిపించారు. శ్రీ శుభానంద దేవికి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు దేవాలయంలోని ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
Kartika pournami: రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. రద్దీగా శైవ క్షేత్రాలు
Chhath Puja 2023 : మరోవైపు ఉత్తర భారతీయులు వారి ఆచారాల ప్రకారం ఛఠ్ పూజలు (Chhath Puja 2023) చేశారు. మోకాలి లోతు నీటిలో నిలబడి సూర్యుడికి ప్రసాదాలను సమర్పించడం ఈ వేడుక విశిష్టత. వెదరు చాటలో పూలు, పళ్లు ఉంచి నదిలో వదిలి పెట్టి ప్రకృతికి నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం సూర్యాస్త సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం ద్వారా భగవంతున్ని ఆశీస్సులు లభిస్తాయని వారి విశ్వాసం. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో విశేషంగా పూజలు నిర్వహిస్తారు.
కార్తికమాసం స్పెషల్ - శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు