ETV Bharat / state

ఏంటీ! కాళేశ్వరం బ్యారేజీల్లో లోపాలను మూడేళ్ల క్రితమే గుర్తించారా! ముందే హెచ్చరించినా పట్టించుకోలేదా! - Lift Irrigation Projects

Kaleshwaram Lift Irrigation Projects Update : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణలో పలు లోపాల్ని ముందే హెచ్చరించినా, అధికారులు పట్టించుకోలేదని బయటపడింది. గేట్ల నుంచి అధిక వేగంతో నీరు కిందకు పోటెత్తడంతో రక్షణ నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, దీనిపై అధ్యయనం చేయించాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ మూడేళ్ల క్రితమే లేఖ రాసింది. అయినప్పటికీ ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు బేఖాతరు చేసినట్లు తేలింది.

Kaleshwaram Lift Irrigation Projects Update
Kaleshwaram Lift Irrigation Projects
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 6:57 AM IST

ఏంటీ! కాళేశ్వరం బ్యారేజీల్లో మూడేళ్ల క్రితమే లోపాలున్నయా- హెచ్చరించినా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోలేదా!

Kaleshwaram Lift Irrigation Projects Update : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు మూడేళ్ల క్రితమే ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిరక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకు విడుదలయ్యే వేగంలో విపరీతమైన మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారు.

ఈ సమస్యను అధిగమించడానికి ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లేబోరేటరీ లేక పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్ స్టేషన్‌- సీడబ్ల్యూపీఆర్​ఎస్ వంటి సంస్థలతో నమూనా అధ్యయనాలు చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌, రామగుండంలోని కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం సీడీవో రాసిన లేఖలను బట్టి స్పష్టమవుతోంది. మూడేళ్ల తర్వాత, సమస్య తీవ్రత పెరిగాక ఇప్పుడు సీడబ్ల్యూపీఆర్​ఎస్​తో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది.

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు

Kaleshwaram Projects Damage : గేట్ల నిర్వహణలో లోపం, బ్యారేజీ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడం, పర్యావసానంగా ఎక్కువ కేంద్రీకృత వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదల సమయంలో ప్రవాహ వేగం నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ పనులు దెబ్బతినడం తదితర అంశాలపై కాళేశ్వరం ఈఎన్సీకి రాసిన లేఖలో సీడీవో వివరంగా పేర్కొంది. ఒక గేటు వద్ద ఇసుక ఎక్కువగా మేట వేసినప్పుడు దీనినుంచి పూర్తిస్థాయిలో నీరు వెళ్లలేనప్పుడు పక్క గేట్ల నుంచి డిజైన్‌ చేసిన దానికంటే ఎక్కువ వేగంతో నీటి ప్రవాహం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్య డిజైన్‌కు సంబంధించినది కాదని, సీడబ్ల్యూపీఆర్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాయి.

పరిణామాలు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్‌ వెలాసిటీ అంటారు. ఒక బ్యారేజీలో ఇది సెకనుకు 4 మీటర్లు అయితే ఇంకో బ్యారేజీలో సెకనుకు 5 మీటర్లు ఉంటుంది. కానీ కాళేశ్వరం బ్యారేజీల్లో, ఈ వేగం ఒకచోట సెకనుకు 12 నుంచి 14 మీటర్లు అయితే ఇంకోచోట సెకనుకు 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఉండాల్సిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్యారేజీల దిగువన ఉన్న సిమెంటు కాంక్రీటు దిమ్మెలన్నీ చెల్లాచెదురవడం, ఇసుక కొట్టుకుపోవడం వంటి పర్యవసానాలు తీవ్రరూపం దాల్చాయి.

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సోదాలు

Kaleshwaram Lift Irrigation Projects Damage in Telangana : మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీటితో పాటు సుందిళ్ల-అన్నారం మధ్య 32 వాగుల నుంచి వచ్చే నీరు కలుస్తుంది. మానేరు నుంచీ నీరు వస్తుంది. మేడిగడ్డ నుంచి వర్షాకాలంలో నీటిని ఎత్తిపోస్తారు. ఇదే సమయంలో పైన ఉన్న వాగుల నుంచి లేదా ప్రధాన గోదావరి నుంచి అధిక ప్రవాహం వచ్చినప్పుడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఈ సమయంలో షూటింగ్‌ వెలాసిటీ ఎక్కువగా ఉంటున్నట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సమస్య వల్లే బ్యారేజీ దిగువన ఉండే కాంక్రీటు బ్లాకులు చెల్లాచెదురై పోయాయి. అన్నారం బ్యారేజీ దిగువన 300 మీటర్ల మేర ఇలా దెబ్బతిన్నట్లు తెలిసింది. టెయిల్‌ వాటర్‌ లెవల్‌ అంటే గేట్ల నుంచి వేగంగా దిగువకు వచ్చే నీటి ప్రవాహం నదిలో కలిసిన తర్వాత ఉండే మట్టం అంచనా వేయడం సరిగా జరగకపోవడం వల్ల, గేట్ల దిగువన ఉండే సిల్లింగ్‌ బేసిన్‌ తగినంతగా లేకపోవడంతో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.

గేట్ల నుంచి నీరు విడుదలయ్యాక ప్రవాహం వేగంగా ఉండే సిల్లింగ్‌ బేసిన్‌ 45 మీటర్లు ఉంటుంది. తర్వాత 60 నుంచి 70 మీటర్ల వరకు సీసీ బ్లాకులు, ఆ తర్వాత 60 మీటర్లకు పైగా లాంచింగ్‌ ఆఫ్రాన్‌ ఉంటాయి. సిల్లింగ్‌ బేసిన్‌లో పడాల్సిన నీరు అక్కడ కాకుండా సీసీ బ్లాకులు ఉండే ప్రాంతంలో పడటంతో అవి దెబ్బతిన్నాయి. ఇప్పుడు సిల్లింగ్‌ బేసిన్‌ను మరో 60 మీటర్లు విస్తరించడంతో పాటు లోతును కూడా పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిసింది. అయితే వచ్చే వర్షాకాలంలోగా ఈ పని జరిగే అవకాశం లేదు.

అప్పటిదాక కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు - రేవంత్ సర్కార్ ఆదేశాలు

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.