దిశ హత్యోదంతంలో జరుగుతున్నదేమిటి? నిందితులను ఎన్ని రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేశారు? నిందితులను కోర్టుకు తీసుకు వస్తారా?... ఈ ప్రశ్నలతో ఉత్కంఠ కొనసాగుతోంది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించిన రోజు రిమాండ్ షీట్ బయటకు రావడంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు చర్లపల్లి జైలు నుంచి నిందితుల వీడియో బయటకు రావడంతో ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీనితో స్థానిక పోలీసులెవరూ పెదవి విప్పడం లేదు.
ఏ క్షణమైనా పోలీసుల కస్టడీకి!
దిశ హత్యాచారం కేసు నిందితులను విచారణ కోసం ఏ క్షణమైనా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండటంతో చర్లపల్లి కారాగారం పరిసరాల్లో హడావుడి నెలకొంది. జైలు ప్రాంగణం, ప్రధాన గేటు ఆవల గట్టి బందోబస్తు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు