జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత, నియమాలపై ట్రాఫిక్ పోలీసులు పలు రకాలుగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుతున్న 30మందికి పోలీసులు చలాన్లు విధించారు.
అదే విధంగా వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకపోతే జరిగే పరిణామాలను వాహన చోదకులకు వివరించారు. వారి చేత ప్లకార్డులు పట్టించి ఇతరులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తామంటూ వారిచేత ప్రమాణం చేయించారు.
ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈ 30 రోజులపాటు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు తెలిపారు.
ఇదీ చదవండి: 'కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ పూజలు చేశారు'