కరీంనగర్లో రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన కేసీఆర్ వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది.
టోర్నమెంట్ ఫైనల్లో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 ఆహ్వానిత జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రెండు రోజుల పాటు రసవత్తరంగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో .. గంగాధర జట్టును కరీంనగర్ జట్టు ఓడించి విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. విజేత కరీంనగర్ జట్టుకు కేసీఆర్ కప్‌తో పాటు.. రూ.15 వేల నగదును బహుమతిగా అందజేశారు.
ఇదీ చదవండి:15 గంటలకు పైగా సాగిన భారత్- చైనా చర్చలు