వివిధ అంశాలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది.
అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు - పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా - PARLIAMENT SESSION 2024
Published : Nov 25, 2024, 10:39 AM IST
|Updated : Nov 25, 2024, 12:09 PM IST
Parliament Winter Session 2024 Live Updates : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదానీ అంశం, మణిపుర్ హింస ఉభయసభలను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మనీశ్ తివారీ, మాణిక్కం ఠాగూర్- అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ సమావేశాల్లో 16 బిల్లులను కేంద్రం చర్చకు తీసుకురానుంది.
LIVE FEED
ఉభయసభలు బుధవారానికి వాయిదా
రాజ్యసభ బుధవారానికి వాయిదా
అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ 15 నిమిషాలు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది.
లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
- అదానీ అంశంపై చర్చించాలని పట్టుపట్టిన విపక్ష సభ్యులు
- లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
- పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
- ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం
పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా : ప్రధాని మోదీ
- పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ
- 2025కు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉన్నాం: ప్రధాని
- శీతాకాలం మొదలైంది. సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి: ప్రధాని
- రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయింది: ప్రధాని మోదీ
- పార్లమెంటులో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలి: ప్రధాని
- పార్లమెంటులో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా: ప్రధాని
- పార్లమెంటులో వీలైనంత ఎక్కువమంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలి: ప్రధాని
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో అర్ధవంతమైన చర్చలు జరగాలి: ప్రధాని
- కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు: ప్రధాని
-
#WATCH | Delhi: Lok Sabha Speaker Om Birla says, "... We have always been loyal to the Constitution, have worked under the guidance of the Constitution. Be it Parliament or Assembly, all democratic institutions have been working according to the Constitution and will continue to… pic.twitter.com/DJmD8oVozv
— ANI (@ANI) November 25, 2024
పార్లమెంటులో చర్చలు సభా గౌరవ మర్యాదలకు అనుగుణంగా జరగాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ఎల్లప్పుడూ రాజ్యాంగానికి విధేయులుగా ఉందని, రాజ్యాంగ మార్గదర్శకత్వంలోనే పని చేస్తోందన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో విభిన్న భావజాలం ఉన్నవారు ఉన్నారని, మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను స్ఫూర్తిగా తీసుకుని సభల్లో మంచి చర్చలు జరపాలని ఎంపీలకు ఓం బిర్లా సూచించారు.

అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు
పార్లమెంటులో ఏమేం అంశాలు చర్చించాలన్నదానిపై కాంగ్రెస్ ఎంపీలకు నిర్దేశించింది. పదిన్నర గంటలకు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీలందరూ సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మనీశ్ తివారీ, మాణిక్కం ఠాగూర్‌లు అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. భారత వ్యాపార రంగంపై అదానీ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియల పటిష్టతపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ మౌనం వల్ల దేశ సమగ్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు