ETV Bharat / state

JEE ADVANCED RANKS: నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకులు విడుదల

author img

By

Published : Oct 15, 2021, 4:09 AM IST

ఐఐటీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకులు నేడు విడుదల కానున్నాయి (JEE ADVANCED RANKS). ఇటీవల విడుదలైన కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి పది లోపు ర్యాంకు ముగ్గురు లేదా నలుగురికి.. వంద లోపు ర్యాంకులు కనీసం 25 ఉంటాయని శిక్షణ సంస్థల అంచనా.

JEE ADVANCED
JEE ADVANCED

ఐఐటీల్లో (iits) సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకులు (Jee Advanced Ranks) ఇవాళ విడుదల కానున్నాయి. ఈనెల 3న జరిగిన జేఈఈ అడ్వాన్స్​డ్ ఆన్​లైన్ పరీక్షకు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 20 వేల మంది పరీక్ష రాశారు (JEE ADVANCED RANKS ). ఇటీవల విడుదలైన కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి పదిలోపు ర్యాంకులు ముగ్గురు, నలుగురికి రావొచ్చని.. వందలోపు ర్యాంకులు కనీసం 25 ఉంటాయని శిక్షణ సంస్థల అంచనా వేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లోని సుమారు 51 వేల సీట్ల భర్తీ కోసం ఆరు విడతల్లో జరిగే ప్రవేశాల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని సంయుక్త సీట్ల కేటాయింపు సంస్థ.. జోసా తెలిపింది. ఈనెల 27న తొలి విడత, నవంబరు 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాలుగో విడత, 14న అయిదో విడత, 18న చివరి విడత సీట్లు కేటాయించనున్నట్లు జోసా ప్రకటించింది.

ఈసారి కఠినంగా

ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌(JEE Advanced exam 2021) కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి పేపర్‌-1 కంటే పేపర్‌-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు.

రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్‌-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒక్కో పేపర్‌ 180 మార్కులకు...

ఈసారి ఒక్కో పేపర్‌ 180 మార్కులకు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 19 చొప్పున ఒక్కో పేపర్‌లో 57 ప్రశ్నలిచ్చారు. ప్రతి సబ్జెక్టులో మళ్లీ నాలుగు సెక్షన్లుగా విభజించి నాలుగు రకాల ప్రశ్నలిచ్చారు. గత ఏడాది 396 మార్కులకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు.

ఇదీ చూడండి: JEE Advanced Online Exam: నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.