జనతా కర్ఫ్యూలో ప్రజలంతా భాగస్వామ్యులయ్యారు. స్వీయ నిర్బంధంలోనే గడిపారు. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని మాత్రమే మినహాయించారు. పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించారు. మిగిలిన వర్గాలన్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. రైళ్లను పరిమితంగా మాత్రమే నడిపించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ బోసిపోయాయి. ప్రధాన మార్కెట్లు, రోడ్లు అన్నీ వెలవెలబోయాయి.
ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితం అయ్యాయి. క్యాబ్‌లు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా రోడ్లపై పెద్దగా కన్పించలేదు. వర్తకులంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చిరు వ్యాపారులు కూడా కన్పించలేదు. హైదరాబాద్ మహానగరంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కూరగాయల మార్కెట్లనూ మూసేశారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సాధారణ ప్రజలంతా అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్