ETV Bharat / state

జలంధర చంద్రమోహన్​కు జీవిత సాఫల్య పురస్కారం - జీవిత సాఫల్య పురస్కారం

వంశీ ఇంటర్నేషనల్​ సంస్థ 2019 సంవత్సరానికి గానూ ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్​ను హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​లో వాసిరెడ్డి సీతాదేవి జీవిత సాఫల్య పురస్కారంతో  ఘనంగా సత్కరించింది.

Jalandhara Chandramohan is the lifetime achievement award
జలంధర చంద్రమోహన్​కు జీవిత సాఫల్య పురస్కారం
author img

By

Published : Dec 20, 2019, 6:01 PM IST

ప్రముఖ రచయిత్రి, సీనియర్ నటుడు చంద్రమోహన్ సతీమణి జలంధర చంద్రమోహన్​కు వాసిరెడ్డి సీతాదేవి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 2019 సంవత్సరానికి గాను వంశీ ఇంటర్నేషనల్ సంస్థ జలంధరను ఈ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్ ఫిల్మ్​నగర్​లోని కళాతపస్వి కె. విశ్వనాథ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జలంధరకు విశ్వనాథ్​ వాసిరెడ్డి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం చంద్రమోహన్ దంపతులను సత్కరించిన విశ్వనాథ్... సోదరుడిగా భావించే చంద్రమోహన్​తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరైన విశ్వనాథ్ సమక్షంలో వాసిరెడ్డి సీతాదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రమోహన్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

జలంధర చంద్రమోహన్​కు జీవిత సాఫల్య పురస్కారం

ఇవీ చూడండి: నష్టాల్లో నడుస్తున్న డిపోలను గట్టెక్కించేందుకు..'డిపోల దత్తత'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.