Jaggareddy warns Revanth reddy : పార్టీ పదవుల నుంచి తొలగించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు ఝలక్ ఇవ్వటం కాదని.... తానే ఆయనకు అసలైన షాక్ ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్‌రెడ్డికి మధ్య మాత్రమేనని... కాంగ్రెస్‌కు సంబంధంలేదని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కలిసి సాగుదామని రేవంత్‌రెడ్డి ఏనాడు తనకు చెప్పకపోగా.. అనుచరులతో తనపై తెరాస ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ముత్యాల ముగ్గులో కథానాయిక మాదిరి కాంగ్రెస్‌లో తన పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.
"వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలగించారు. నాకు రేవంత్ ఝలక్ ఇవ్వడం కాదు.. నేనే ఆయనకు ఝలక్ ఇస్తా. నాకు రేవంత్ మధ్య గొడవతో పార్టీకి నష్టం కలగదు. రేవంత్ పట్టుబట్టి నన్ను సస్పెండ్ చేయించినా పార్టీకి నష్టం లేదు."
-జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
కలిసి పనిచేద్దామని ఏ రోజూ చెప్పలేదు
Jaggareddy Comments on Revanth reddy : ఇటీవల సీఎల్పీలో రేవంత్‌రెడ్డి తానూ కలిసినప్పుడు.. ఇద్దరూ కలిసిపోయారని అనుకునేలా ఫొటోలు బయటికి వచ్చాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ తనను బుజ్జగించాడని అందరూ అనుకున్నారని.. కానీ కలిసి పనిచేద్దామని కూడా ఆయన తనతో ఏనాడు అనలేదని తెలిపారు.
మనం అప్రమత్తంగా ఉండాలన్నారు
"ఇటీవల సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు..కేసీఆర్‌కు సీరియస్‌గా ఉంది, ఆస్పత్రిలో ఉన్నారని రేవంత్ చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని నాతో అన్నారు. పోలీసు వ్యవస్థను గవర్నర్ తన కంట్రోల్‌లోకి తీసుకున్నారని.. మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు."
-జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి : రేవంత్ రెడ్డిపై అందుకే నాకు కోపం వచ్చింది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి