'దేశంలో బలమైన నాయకుడనే జగన్ను ఆహ్వానించలేదు' - మంత్రి బొత్స వార్తలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడని... అందుకే విందుకు ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని గుర్తు చేశారు.