ETV Bharat / state

ఇన్ఫినిటీ-360 పరికరాన్ని ఆవిష్కరించిన జయేష్​ రంజన్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

తెలంగాణ ‌కేంద్రంగా అధునాతన పరికరాలు తయారవడం గర్వకారణంగా ఉందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో 'ఇంటింటా ఇన్నోవేటర్- 2020' విజేత.... అవినాష్ గండి రూపొందించిన ఇన్ఫినిటీ-360 పరికరాన్ని జయేష్‌రంజన్ ఆవిష్కరించారు.

ఇన్ఫినిటీ-360 పరికరాన్ని ఆవిష్కరించిన జయేష్​ రంజన్​

author img

By

Published : Aug 22, 2020, 5:23 AM IST

హైదరాబాద్​లోని ఓ హోటల్​లో 'ఇంటింటా ఇన్నోవేటర్- 2020' విజేత అవినాష్ గండి రూపొందించిన ఇన్ఫినిటీ-360 పరికరాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహించిన 'ఇంటింటా ఇన్నోవేటర్ - 2020 గా అవినాష్ గండి రూపొందించిన ఇన్ఫినిటీ-360 పరికరం ఎంపికైంది.

ఇన్ఫినిటీ-360 అనబడే యూవీ-సీ శానిటైజేషన్ డివైస్ ద్వారా అతినీలలోహిత కిరణాలు ప్రసరించి.... పరిసరాలలో ఉన్న కరోనా వైరస్, ఇతర బ్యాక్టీరియాలను సమూలంగా నాశనం చేస్తుందని రూపకర్త అవినాష్ వెల్లడించారు. కరోనా విపత్కాలంలో సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేశారని..... అవినాష్ గండి బృందాన్ని జయేష్‌రంజన్‌ అభినందించారు.

ఇవీచూడండి: 'గణపయ్య పూజకు ఆన్​లైన్​లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.