ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ నేడు సిట్ ముందు హాజరుకానున్నారు. డేటా చౌర్యం కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన అశోక్‌ను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా నిబంధన విధించారు. ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బుధవారం వెళ్లారు. ప్రస్తుతం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నందున సిట్ అధికారులనే కలవాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. ఈ రోజు గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో అధికారుల ముందు అశోక్ హాజరుకానున్నారు. డేటా చౌర్యం కేసు సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద అశోక్‌పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కీలక సమాచారం కూడా సేకరించారు. డేటా చౌర్యానికి గురైనట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ తేలింది.
ఇవీ చూడండి: ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌కు హైకోర్టులో ఊరట!