ETV Bharat / state

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ! - తెలంగాణ ఐటీ ఎగుమతుల సమాచారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆరేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. రాష్ట్రం ఏర్పడినపుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,28,807 కోట్ల ఐటీ ఎగుమతులు చేశారు. మరో 2.10 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు వచ్చాయి. 2020లో కరోనా ప్రభావం ఐటీ రంగంపై పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే.. తెలంగాణ మాత్రం ఎగుమతులు 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకుంది.

IT exports top place from Telangana
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ!
author img

By

Published : Jun 2, 2020, 5:10 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగం అభివృద్ధి ఆరేళ్లేలో శరవేగంగా జరిగింది. ఎగుమతులు పెరిగాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్రతోపాటు.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాల్ని నడుపుతున్నాయి. ఐటీ రంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను రూ.31 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా మడికొండలోని ఐటి పార్కులో టెక్ మహీంద్రా, సైయెంట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ బ్రాంచీలు ఏర్పాటు చేశాయి. తాజాగా క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ మడికొండలోని ఐటి పార్కులో భూమి పూజ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో..

ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్​ను ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచన కలిగిన ఔత్సాహికులకు ఇది ప్రేరణగా నిలుస్తున్నది. టీ-హబ్ అసాధారణ విజయం తరువాత, 4 వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అదనపు ఇంక్యుబేషన్ స్థలంతో టీ-హబ్ IIవ దశను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. టీ హబ్ రెండో దశను 2020 జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. టీ-హబ్‌ రెండోదశ భవనాన్ని 9 అంతస్తులు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

టీ-బ్రిడ్జ్..

ప్రపంచంలోని వివిధ దేశాల స్టార్టప్‌లతో హైదరాబాద్ స్టార్టప్‌లను అనుసంధానించేందుకు టీ-బ్రిడ్జ్ ఉపయోగ పడనుంది. భారతదేశం-సిలికాన్ వ్యాలీ మధ్య ఆలోచనల మార్పిడికి, స్టార్టప్​ల బదలాయింపులకు టీ-బ్రిడ్జ్​ దోహదపడుతుంది. టీ-బ్రిడ్జ్ వల్ల భారతీయ స్టార్టప్​లు, సిలికాన్ వ్యాలీ స్టార్టప్​ల మధ్య ఆలోచనల మార్పిడి జరుగుతుంది. టీ-బ్రిడ్జ్ ద్వారా 100కుపైగా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో 40కిపైగా జాతీయస్థాయి పరిశోధన ల్యాబ్‌లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నాయి.

ఇదీ చూడండి : శోభాయమానం.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భాగ్యనగరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.