ETV Bharat / state

పెట్టుబడులకు పోటీ... హైదరాబాద్​ నలువైపులా ఐటీ! - హైదరాబాద్​లో ఐటీ విస్తరణ తాజా వార్తలు

రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంతో.. హైదరాబాద్​ రూపురేఖలు మారిపోతున్నాయి. సాంకేతిక, బహుళజాతి సంస్థలు కొలువవుతున్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో కొత్తగా నగరానికి రానున్న సంస్థలను కొత్త ప్రాంతాలను విస్తరింపజేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అన్ని వైపులా సమాన అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు లుక్ ఈస్ట్, లుక్ నార్త్, గ్రిడ్ పాలసీలతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం సూచిస్తున్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ నగరంతో పాటు, శివారు ప్రాంతాలను వృద్ధి బాట పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.

it companies expandes in hyderabad surrounding areas
హైదరాబాద్​ నలువైపులా ఐటీ అభివృద్ధికి సర్కార్​ చర్యలు
author img

By

Published : Nov 19, 2020, 9:19 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్.. లక్షల కోట్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. ముఖ్యంగా ఐటీ, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్​కు కేంద్రంగా దేశ, అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రధానంగా నగరానికి ఆధునిక హంగులు అద్దిన.. ఐటి రంగం అభివృద్ధితో నగర స్వరూపం మారిపోయింది. ఈ రంగ సంస్థలు ఎక్కువగా మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో విస్తరించటంతో.. ఆ ప్రాంతం మిగతా నగరానికి భిన్నంగా అభివృద్ధి చెందింది. నగరం పశ్చిమం వైపుకే అభివృద్ధి పరిమితమైంది.. దీంతో రానున్న నూతన సంస్థలు, కంపెనీలను, తద్వారా వచ్చే అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు గ్రిడ్-గ్రోత్ ఇన్ డిస్‌పర్షన్ పాలసీని ‍తీసుకొచ్చింది. లుక్ ఈస్ట్, లుక్ నార్త్ ఫర్ ఐటీ అనే విధానంతో నగరం తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోనూ ఐటీ విస్తరించేలా ప్రోత్సహిస్తుంది.

కొవిడ్ పరిస్థితుల్లోనూ 10 శాతం వృద్ధి

హైదరాబాద్‌కు ఐటీ రంగం ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇక్కడి నుంచి దాదాపు 2 వేల ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. 7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది రాష్ట్ర ఐటీ రంగం.. 17 శాతం వృద్ధిని నమోదు చేయగా.. కొవిడ్ పరిస్థితుల్లోనూ 10 శాతం వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే.. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు పది లక్షలకు చేరుకుంటారని ఓ అంచనా... ఇంతటి ముఖ్యమైన రంగాన్ని నగరమంతటా విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. అందుకు నగరం నలువైపులా మౌలిక వసతులను కల్పిస్తూ.. కొత్త సంస్థలకు స్థలాలను కేటాయిస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు అందించేందుకు విధాన నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఉప్పల్, నాగోల్, పోచారం, మహేశ్వరం, తుక్కుగూడ, ఆదిభట్ల, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటయ్యేలా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఈ ప్రాంతాల్లో ఐదు ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఇతర నగరాలకు విస్తరణ

ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని.. రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించేలా ప్రభుత్వం కార్యచరణను ప్రారంభించింది. ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్​నగర్ వంటి నగరాల్లో ఐటీ కారిడార్‌లు, టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్​లో కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వాటిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే మిగతా చోట్లా ఐటీ టవర్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఆఫీస్ స్వేస్‌కు రోజురోజుకూ డిమాండ్

మరోవైపు హైదరాబాద్‌ భౌగోళిక పరిస్థితుల కారణంగా.. వరదలు, భూకంపాలు రాని సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీంతో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. డాటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ పాలసీలను తీసుకొచ్చింది. మరోవైపు కంపెనీల విస్తరణ, పెట్టుబడుల వెల్లువతో హైదరాబాద్​లో ఆఫీస్ స్వేస్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో నగరంలో ఆఫీస్ స్పేస్ మూడింతలు పెరగగా... దేశవ్యాప్తంగా తెలంగాణ ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దీంతో భాగ్యనగరంలోని భూముల విలువల భారీగా పెరుగుతోంది.

20 వరకు పారిశ్రామిక కారిడారులు

కొవిడ్ కాలంలోనూ నగరానికి పెట్టుబడులు వెళ్లువెత్తాయి. లాజిస్టిక్స్, లైఫై సెన్సెస్, ఫార్మా, హార్డ్‌వేర్, తయారీ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. వీటిని శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి, శంకర్ పల్లి, సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లోని పారిశ్రామిక క్లస్టర్లల్లో స్థలాలు కేటాయిస్తోంది. నగరంలో పరిశ్రమలకు స్థలాలు కేటాయించేందుకు.. 20 వరకు పారిశ్రామిక కారిడార్‌లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కొరియన్ కంపెనీలను ప్రోత్సహించేందుకు.. త్వరలోనే కొరియన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మెట్రో కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు

పెద్ద ఎత్తున కంపెనీలు విస్తరణకు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవటంతో.. అందులో పనిచేసే నైపుణ్యం గల మానవ వనరుల కోసం ఇండస్ట్రీ రెడీ నైపుణ్యాలతో నిరుద్యోగులను అప్ స్కిల్ చేసే స్కిల్ సెంటర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆకాడమిక్, స్టార్టప్, స్కిల్ డెవలప్ మెంట్ ఎకోసిస్టం బలంగా ఉన్న హైదరాబాద్​లో నిపుణులైన మానవ వనరులకు వెళ్లువెత్తుతోన్న పెట్టుబడులు సరైన ఉపాధి బాటను చూపిస్తున్నాయి. మెట్రో కనెక్టివిటీని పెంచేందుకు ఒకవైపు ప్రభుత్వం యోచిస్తోంది. నగరీకరణ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావటం, పలు సుందరీకరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీల రాక, ఉద్యోగల పెరుగుదలను ముందస్తు అంచనాలతో స్ట్రాటజిక్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద నగర వ్యాప్తంగా పైవంతెను, అండర్ పాస్​ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఆదిభట్ల, కొల్లూరు, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లో పెద్ద కంపెనీల రాకతో విస్తారమైన రోడ్లు, కమ్యూటర్ సౌకర్యం పెరుగుతోంది.

టీ-హబ్ రెండో ఫేజ్​

ఒకప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి ఆనవాళ్లుగా సైబర్ సిటీని ప్రముఖంగా చూపించే స్థాయి నుంచి.. ఇపుడు జీనోం వ్యాలీ, మెట్రో కనెక్టివిటీ, యూఎస్ తర్వాత టాప్ ఫైవ్ గ్లోబల్ క్యాంపస్ ప్రాంగణాలు, థీమ్ పార్కులు, భారీ పారిశ్రామిక పార్కులు, అదే కోవలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, త్వరలో ప్రారంభం కానున్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం, టీ-హబ్ రెండో ఫేజ్​ వంటివి హైదరాబాద్ ఖ్యాతిలో కలికితురాయిలా నిలిచి నవీన హైదరాబాద్​కు చిరునామాగా నిలవనున్నాయి.

ఇదీ చదవండి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు నిబంధనలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.