తెలంగాణలో సుప్రసిద్ధ దేవాలయం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పరమశివునికి మహాప్రీతి అయిన మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏట మరింత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం అందింది.
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆలయ ఈఓ, పూజారులు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు. 21న జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలకు కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా కేసీఆర్ను కోరారు.