UN PEACE WORKING: అశాంతితో విసుగెత్తిన ఆ నేలలో శాంతి కోసం.. - తెలంగాణ వార్తలు
ఏళ్లుగా యుద్ధం.. అశాంతితో విసుగెత్తిన ఆ నేలలో శాంతిని నెలకొల్పి, మనుషుల్లో నమ్మకాన్ని నిర్మించడం అంత తేలిక వ్యవహారం కాదు. నిత్యం తుపాకుల పహారాలో ఉండే దక్షిణసుడాన్‌లో అడుగుపెట్టి ఏడాదిపాటు ధైర్యంగా పోలీసు విధులు నిర్వహించారు పల్లె పద్మ. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో భాగంగా దక్షిణ సుడాన్ నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఆమెతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ దళం, పల్లె పద్మ
By
Published : Jul 6, 2021, 12:12 PM IST
‘బాగా చదువుకుని మంచి ఉద్యోగం దొరికితే చాలు...' మొదట్లో నా ఆలోచనలు ఇలానే ఉండేవి. అందుకే బీఈడీ చేశాను. మాది కరీంనగర్. కాలేజీలో ఎన్‌సీసీలో చేరా. ఆ యూనిఫాం వేసుకున్నప్పుడు మనసంతా తెలియని సంతోషం. ఇంతలో నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు రాసి పోలీసు ఫోర్స్‌లో చేరడానికి అర్హత సాధించాను. శిక్షణ పూర్తయ్యి.. 2005లో హైదరాబాద్ బంజారాహిల్స్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరా. ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లైంది. మాకిద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు.
ఈసారి నేనొక్కదాన్నే...
ఐక్యరాజ్యసమితి నిర్వహించే ‘పీస్‌కీపింగ్ మిషన్’ గురించి మా సీనియర్లు మాట్లాడుతుంటే విన్నా. ఆసక్తిగా అనిపించింది. ప్రపంచదేశాల్లో శాంతిని పరిరక్షించడం ఈ మిషన్ లక్ష్యం. కెరీర్‌లో ఒక్కసారైనా అటువంటి విధులు నిర్వర్తించాలని అనిపించింది. దీనికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. మనలో సేవాభావం, ప్రజారక్షణ పట్ల మనకున్న బాధ్యత వంటివీ చూస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఐరాస నేషన్స్ సెలక్షన్ అసిస్టెంట్స్ అండ్ అసెస్‌మెంట్ టీం(శాట్) పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించా. ఇందులో రిపోర్ట్ రైటింగ్, డ్రైవింగ్, ఫైరింగ్ నైపుణ్యాలని పరీక్షిస్తారు. తర్వాత దిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్లి ఎంపికయ్యా. ఎంపికైన 160 మందిని రెండేళ్లపాటు పలు దేశాలకు పంపిస్తారు. అలా గతేడాది ఫిబ్రవరిలో నాకు సౌత్ సుడాన్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా 11 మంది ఈ పీస్‌మిషన్‌కు ఎంపికైతే అందులో అయిదుగురం మహిళలం. తెలంగాణ నుంచి ఈ ఏడాది ఎంపికైన వాళ్లలో నేనొక్కదాన్నే మహిళను కావడం గర్వంగా అనిపించింది.
పల్లె పద్మ
సౌత్ సుడాన్ నుంచి స్వాతంత్య్రం కోసం ఆరేళ్లకుపైగా యుద్ధం చేసింది. యుద్ధం ముగిసేనాటికి అక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతో మంది సొంతగడ్డను వదిలి పునరావాసకేంద్రాల్లో ఏళ్లుగా మగ్గిపోయారు. అక్కడ తిరిగి పూర్వపు పరిస్థితులు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి కృషి చేస్తోంది. మగవారంతా యుద్ధ భూమిలో ఉంటే వాళ్లు తిరిగి వచ్చేంతవరకూ ఆడవాళ్లే ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. అయితే ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్కడి స్త్రీలు ధైర్యస్తులు. వాళ్ల మనోబలం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అక్కడి ప్రభుత్వం వివిధ రంగాల్లో స్త్రీలకు అవకాశం వచ్చి మహిళలను ప్రోత్సహించాలని చూస్తోంది.
ఇంకా యుద్ధ ఛాయలు పూర్తిగా పోని ఆ దేశంలో విధి నిర్వహణ అంత తేలిక కాదు. అక్కడి భాషతో నాకే ఇబ్బందీ కాలేదు. దుబాసీల సాయం ఉండేది. ఐరాస పోలీసులు, స్థానిక పోలీసు విభాగంతో కలిసి అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ, నేర పరిశోధన, ఇంటరాగేషన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాల్లో సహకరించాం. పలు విషయాల్లో స్థానిక పోలీసులకు అవగాహన కలిగించా. అక్కడి పోలీసుస్టేషన్లకు ఎన్నో రకాల కేసులు వచ్చేవి. వాటిలో దొంగతనం నుంచి అత్యాచారాలు, హత్యలు, వర్గవిభేదాలు, కొట్లాటలు వంటివన్నీ ఉండేవి. వాటికి సంబంధించిన ఇంటరాగేషన్, కేసు ఫైల్ చేసి అధికారులకు అందించడం వంటి బాధ్యతలు నిర్వర్తించాను. ఇతర పోలీసులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేదాన్ని. దీంతోపాటు అక్కడి ఎన్జీవోలతోనూ కలిసి పనిచేశాం.
కష్టమే అయినా.... ఇష్టంగా
అక్కడ వంట నుంచి ఇంటి పని వరకూ ఎవరికి వారే చేసుకోవాలి. కుటుంబానికి దూరంగా ఉండటం ఒక్కోసారి చాలా కష్టంగా అనిపించేది. కానీ... మనసుకు నచ్చిన పని కావడంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. వివిధ ప్రాంతాల నుంచి సేవలందించడానికి వచ్చిన మహిళా అధికారులతో కలిసి పనిచేయడంతో తెలియని చాలా విషయాలను నేర్చుకున్నా. 13 నెలల తర్వాత అక్కడి నుంచి వచ్చా. నా కుటుంబ సహకారం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఈ అనుభవం జీవితాంతం గుర్తుంటుంది. ప్రస్తుతం బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.