వ్యవసాయ రంగం బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా నేపథ్యంలో కుదేలైన వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకునే క్రమంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రతి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఆగ్రోస్ సేవా కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తోంది.
ఆగ్రోస్ సేవా కేంద్రాల్లో నాణ్యమైన ఆహరోత్పత్తులు విక్రయించేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో పౌరుల్లో రోగనిరోధక శక్తి పెంపు కోసం పౌష్టిక విలువలు గల "చిరుధాన్యాల ఇమ్యూనిటీ కిట్" ను అందుబాటులోకి తీసుకురానుంది. బాస్మతి బియ్యంతో పాటు సేంద్రీయ గోధుమ పిండిని సరఫరా చేయనుంది. తద్వారా కూలీల కొరత అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలని యోచిస్తోంది. అలాగే యంత్రాల వినియోగం, వ్యాపార నైపుణ్యాలపై యువతకు, అంకుర కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ - ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములుతో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు