'భాగ్యనగరంలో విదేశీ కవుల సందడి' - పోలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 12 మంది విదేశీ కవులు
భాగ్యనగరం భిన్నత్వంలో ఏకత్వమని పలువురు విదేశీ కవులు అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి గురించి పుస్తకాల్లో మాత్రమే చదివేవారమని.. ఇప్పుడా హైదరాబాద్‌ను చూస్తుంటే అవన్ని నిజమే అనిపిస్తుందన్నారు పోలెండ్, ఫిలిప్పిన్స్ దేశాలకు చెందిన కవులు.
పోలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 12 మంది విదేశీ కవులు, తెలుగు రాష్ట్రాల్లోని కవులు హైదరాబాద్‌లోని పలు పర్యటక ప్రదేశాలను సందర్శించారు. సోమవారం హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకులు బి. నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలుగు కవులు అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, రామా చంద్రమౌళి, విఆర్ విద్యార్థి, అన్నవరం శ్రీనివాస్ హాజరయ్యారు. మూడు రోజుల నగరం పర్యటనలో గోల్కొండ ఖిల్లా, శిల్పారామం, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి ప్రసిద్ధ కట్టడాలు విదేశీ కవులు వీక్షించారు. రైటర్స్ కార్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ కవులు,కళాకారులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులను ఘనంగా సత్కరించి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి కవి సమ్మేళనం జరగడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు సినీ దర్శకుడు బి నరసింగరావు.
ఇవీ చూడండి : "తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలి"
vyas
Conclusion: