కాచిగూడ చాదర్ఘట్లోని ఎంఎస్ఎస్ న్యాయ కళాశాలలోని లీగల్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యునిసెఫ్ ప్రతినిధి సోని కుట్టి జార్జ్ వర్చువల్ వేదికగా ముఖ్య అతిథిగా హాజరై.. మానవ హక్కుల ప్రాధాన్యతను వివరించారు.

అనంతరం కళాశాల ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహనపై క్విజ్ పోటి నిర్వహించి విజేతలకు ఈ-సర్టిఫికేట్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ సురేంద్ర లూనియా, జాయింట్ సెక్రటరీ ఎస్.బి.కాబ్రా, డైరెక్టర్ డీవీజీ కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.డి.ఆదిల్, లీగల్ అకాడమీ ఇంఛార్జీ ప్రదీప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రేపట్నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు