ETV Bharat / state

International Ganja Peddling Racket busted in Hyderabad : కొబ్బరిపీచు లోడు మాటున గంజాయి సరఫరా.. అంతర్జాతీయ ముఠా అరెస్ట్ - అంతర్జాతీయ గంజాయి గ్యాంగ్​ అరెస్టు

International Ganja Peddling Racket busted in Hyderabad : రాష్ట్రంలో గంజాయి విక్రయదారులు, ఎగుమతిదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అంతర్జాతీయ గంజాయి ముఠా సభ్యులు ఇద్దరిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.75 లక్షల విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

International Ganja arrest
International Ganja Peddling Racket busted in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 11:03 AM IST

International Ganja Peddling Racket busted in Hyderabad : రాష్ట్రాలే కాదు.. ఏకంగా దేశ సరిహద్దులు దాటి గంజాయి(Ganja Gang Arrest) సరఫరా చేసే అంతర్జాతీయ ముఠా(Interstate Drug Gang)ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు.. శ్రీలంక దేశానికి గంజాయి సరఫరా చేసే ప్రధాన సూత్రధారి ఆదేశాల మేరకు పని చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడకుండా లారీలో కొబ్బరి పీచు లోడు మధ్య సరకు దాచి తరలిస్తోన్న నిందితుల నుంచి రూ.75 లక్షల విలువైన 250 కిలోల గంజాయితో పాటు లారీ, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన మలైలిసామి అలియాస్‌ శివ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు ఉపాధి కోసం వచ్చారు. ఇక్కడే చిరుతిళ్లు తయారు చేసే వ్యాపారం చేసేవాడు. ఎంతకష్టపడ్డా ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్నాడు. అతని మేనమామ తమిళనాడుకే చెందిన రాజా స్టాలిన్‌ 2021లో గంజాయి కేసులో సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడిని బెయిలుపై తీసుకొచ్చే క్రమంలో మలైలిస్వామికి కేరళకు చెందిన రాజేశ్‌తో పరిచయం ఏర్పడింది. రాజేశ్‌ గంజాయి స్మగ్లింగ్‌లో అప్పటికే ఆరితేరాడు.

Interstate Drug Racket Gang Arrest : మలైలిస్వామి ఆర్థిక ఇబ్బందులో ఉన్నట్లు తెలుసుకున్న రాజేశ్‌.. అతనికి డబ్బు ఆశచూపించి గంజాయి సరఫరా చేయాలంటూ ప్రోత్సహించాడు. తన డ్రైవరుగా నియమించుకుని ఒక్క ట్రిప్పు గంజాయి తరలిస్తే రూ.1.50 లక్షల చొప్పున ఇస్తానని ఆశచూపాడు. ఇదే సమయంలో తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన రామార్‌ చాంద్రాయణగుట్టకు ఉపాధి కోసం వచ్చాడు. రామార్‌ను తన సహాయకుడిగా పెట్టుకున్న మలైలి సామి.. రాజేశ్‌ ఆదేశాల ప్రకారం.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చేవాడు. గతంలో రెండుసార్లు 500 కిలోలకుపైగా సరకును రాజేశ్‌కు అందించాడు. రాజేశ్‌ వీటిని హైదరాబాద్, మహారాష్ట్ర, తమిళనాడు, శ్రీలంకలోని తన ఏజెంట్లకు విక్రయాలు జరిపాడు.

3 Crore Worth of Ganja Seized by Police : సైబరాబాద్​లో మరో గంజాయి గ్యాంగ్​ అరెస్ట్​.. రూ.3 కోట్లు విలువైన సరుకు స్వాదీనం

Hyderabad Cops Bust Interstate Drug Racket : నగరం నుంచి గత నెల 24వ తేదీన రాజేశ్‌ ఆదేశాల ప్రకారం మలైలి సామి, రామార్‌ ఇద్దరూ ఒడిశాకు వెళ్లారు. అక్కడ స్థానిక విక్రయదారుడు చంద్రశేఖర్‌ దగ్గర 250 కిలోల గంజాయి కొన్నారు. అప్పుడే తీసుకొస్తే పోలీసులకు చిక్కే అవకాశముంటుందని వాయిదా వేశారు. ఈలోపు 250 కిలోల గంజాయిని 120 ప్యాకెట్లలో నింపి ఒక లారీ కంటెయినర్‌లో కొబ్బరిపీచు లోడు మధ్య రహస్యంగా ఉంచారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు హడావిడిలో ఉంటారని తెలుసుకుని గత నెల 29న నగరంలోని చాంద్రాయణగుట్టకు తీసుకొస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్‌వోటీ మహేశ్వరం ఇన్‌స్పెక్టర్లు జంగయ్య, రవికుమార్‌ బృందం మీర్‌పేటలో వాహనాన్ని అటకాయించి సోదాలు చేశారు. కొబ్బరి పీచు లోడు మాటున దాచినట్లు గుర్తించి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక, ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న తీరుపై మరింత దర్యాప్తు చేస్తామని, ఈ కేసులో ఇతర నిందితుల్ని త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్‌ తెలిపారు.

Ganja Gang Arrest in Mancherial : ఇటుకల లోడు మాటున 465కిలోల గంజాయి..

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.