ETV Bharat / state

ఉపాధి హామీ నిధులపై కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య కుదరని సయోధ్య - latest news on upadhi hami padakam

ఉపాధి హామీ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కల్లాల నిర్మాణం సహా ఇతర పనులు చేపట్టారని రూ.150 కోట్లను రికవరీ చేయాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో భారీగా సాగుతున్న వరి పంట, రైతుల అవసరాల దృష్టిలో ఉంచుకొని.. కల్లాలు నిర్మించామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఉపాధి హామీ నిధులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది

ఉపాధి హామీ నిధులపై కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య కుదరని సయోధ్య

author img

By

Published : Dec 31, 2022, 9:43 PM IST

రైతులు పండించిన పంటను ఆరబోసేందుకు ఉపాధి హామీ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్లాల నిర్మాణం సహా ఇతర పనుల అంశం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. నిబంధనకు విరుద్ధంగా కల్లాల నిర్మాణం, ట్రీ ఏర్పాటు, ట్రెంచ్‌ల తవ్వకం, తదితర పనులు చేపట్టారని అభ్యంతరం తెలిపిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందుకు ఖర్చు చేసిన రూ.151.91 కోట్లను బాధ్యులైన అధికారుల నుంచి రాబట్టి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఉపాధి హామీల పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాల నివేదికల ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నవంబర్‌లో నోటీసు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు: నవంబర్ 12న లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా రికవరీ చేయకపోతే జాతీయ ఉపాధిహామీ చట్టం ప్రకారం నిధులు ఆపివేస్తామని కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. కేంద్ర నోటీసులపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను ఉత్పాదకత పనుల కోసమే వినియోగిస్తున్నామని, ఎక్కువ ఆంక్షలు పెట్టడం చట్టం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీస్తుందని వివరణ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి

నిధులు రాష్ట్రానికి ఇంకా రాలేదు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్వహించిన ప్రీబడ్జెట్ సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని లిఖిత పూర్వకంగా ప్రస్తావించింది. కేంద్రం నుంచి రావాల్సిన ఉపాధిహామీ పెండింగ్ నిధులు రాష్ట్రానికి ఇంకా రాలేదు. కేంద్ర వైఖరికి నిరసనగా భారాస ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాల్లో నిరసనలు కూడా తెలిపారు. రెండు రోజుల కిందట దిల్లీ వెళ్లిన ఉన్నతాధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కలిసి ఉపాధిహామీ నిధుల విషయమై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో: రాష్ట్రంలో భారీ ఎత్తున వరిసాగు అవుతోందని సన్నకారు, మధ్య తరహా రైతుల కోసమే కల్లాల నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. రైతుల కోసం చేసిన ఖర్చుకు అభ్యంతరం తగదని తెలిపారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధిహామీ నిధులు రాష్ట్రానికి ప్రస్తుతం 800 కోట్ల వరకు రావాల్సి ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇస్తారా లేక 150 కోట్లు కోత విధించి మిగతా మొత్తాన్ని విడుదల చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ఉపాధి హామీ నిధులపై కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య ఆసక్తి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.