వెబ్‌సైట్‌లో ఇంటర్ విద్యార్థుల మెమోలు.. ఫెయిలైన వారూ పాసే - ఇంటర్ విద్యార్థుల ఫలితాల వార్తలు
గ్రేస్ మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు లక్ష 51 వేల మంది ఫెయిలయ్యారు. అయితే కరోనా కారణంగా వారికి గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేస్ మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మెమోలను వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో ఈ ఏడాది లక్ష 51 వేల మంది ఫెయిలయ్యారు. అయితే కరోనా కారణంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నందున.. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కసరత్తు పూర్తిచేసిన ఇంటర్ బోర్డు సవరించిన మార్కుల మెమోలను రూపొందించి వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన మొత్తం 3 లక్షల 74 వేల మందికి ఉత్తీర్ణత లభించింది. గ్రేస్ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు కంపార్ట్ మెంటల్ లో పాస్ అయినట్టు బోర్డు పేర్కొంది.
ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల