ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ మౌన ప్రదర్శన నిర్వహించింది. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంపై నిపుణుల కమిటీ ఇచ్చిన అంశాలను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యావేత్తలతో కమిటీ వేసి ఇంటర్మీడియట్ వ్యవస్థను బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యం... లారీ కిందపడి ఒకరి దుర్మరణం