కానిస్టేబుల్ ఎంపిక పక్రియలో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ పద్ధతితో అర్హత కలిగిన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అవకతవకల వల్లనే ఆరుగురు అభ్యర్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న వారికి కొవ్వొత్తులతో గన్‌పార్క్ వద్ద నివాళి అర్పించి మౌనం పాటించారు.
నార్మలైజేషన్ పద్ధతి వల్ల 110 మార్కులు సాధించిన అభ్యర్థులకు 90 మార్కులు వేసి అనర్హులుగా ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికి సెలెక్షన్ లిస్టులో అర్హులైన వారి పేర్లు లేవని తెలిపారు. ఈ వ్యవహారంపై నవంబర్ 5న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో... రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకలను సరిచేసి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అభ్యర్థులందరం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు