ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 4వ తేదీ వరకు పొడిగించారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు రుసుము చెల్లించే గడవు ఈనెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 5వ తేదీ లోపు ఆన్లైన్లో ఫీజులను బోర్డుకు చెల్లించాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'సీఎం గారు.. టపాసులు పంపించండి'