కొవిడ్ చికిత్సలో ప్లాస్మా థెరపీ కొంత ఊరటనిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అత్యవసర స్థితిలో ఉన్న చాలామందికి దీని ద్వారానే ప్రాణం పోస్తున్నారు. కరోనా నుంచి కోలుకొన్న పలువురు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. కోలుకున్న వారి నుంచి ఉచితంగా తీసుకున్న ప్లాస్మాను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాలు ఒక్కో యూనిట్‌ను రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముకుంటున్నాయి. అరుదైన రక్త గ్రూపులకు రూ.లక్ష వసూలు చేసిన సందర్భాలున్నాయి. అవసరానికి మించి దాతల నుంచి సేకరించి విక్రయిస్తున్నట్లు సమాచారం.
సూచనలివి..
*● సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న వాటిని నిర్ధా.రించుకోకుండా ఇతరులకు పంపొద్ధు
* దాతలకు రవాణా, ఇతర ఖర్చులంటూ అడిగితే.. వారు వచ్చేదాకా డబ్బులు వేయొద్ధు
* దాతలు కోరితే వీలైతే రవాణా ఖర్చులు అందించండి
* దళారులు, ప్రైవేేట్ కేంద్రాలు ఎక్కువ వసూలు చేస్తే స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయొచ్చు
* ప్లాస్మా కోసం అధికారిక వెబ్‌సైట్లు, అందులో ఉన్న నంబర్లను మాత్రమే సంప్రదించండి.
కొవిడ్ బాధితుడికి అత్యవసరంగా ప్లాస్మా అవసరమైంది. దాతలు దొరక్కపోవడంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకును ఆశ్రయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున 2 యూనిట్లు కొన్నారు.
ఇదో రకం మోసం
ప్లాస్మా అత్యవసరముందనగానే మేమిస్తామంటూ ముందుకొచ్ఛి. రవాణా ఖర్చుల పేరుతో రూ.5 వేలు తీసుకుంటున్నారు. డబ్బు ముట్టగానే ఫోన్ ఆపేస్తున్నారు. ఇలాంటి వారిని పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి
సాయం చేసేందుకు వచ్చే దాతలతో ముందే బేరాలు ఆడొద్ధు ఇదే అదనుగా చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్నారు. మొన్నటి దాకా కొందరు రెండు యూనిట్లకు రూ.3 లక్షల వరకు వసూలు చేశారు.
- అఖిల్ ఎన్నంశెట్టి, సీ19 టాస్క్‌ఫోర్స్
ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఛార్జీలు
నాకు నిత్యం 300లకు పైగా ఫోన్లు వస్తున్నాయి. కేవలం ఇద్దరు, ముగ్గురికే ప్లాస్మా ఇప్పించగలుగుతున్నాం. అంత కొరత ఏర్పడుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిని సంప్రదించి ఇప్పించేలా ప్రభుత్వమే చొరవ చూపాలి. లేకుంటే ఎన్జీవోలకు ఇచ్చినా ఆ బాధ్యత నెరవేరుస్తాయి.
- అఖిల్ చౌహాన్, సామాజిక కార్యకర్త.
ప్లాస్మా దొరికే వేదికలివి..
● donateplasma.scsc.in ఈ లింకులో వివరాలు నమోదు చేసుకుంటే.. దాతలు దొరకగానే సమాచారం అందుతుంది.
● సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూమ్ 94906 17440
● రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ 94906 17234
ఇదీ చూడండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు