కొవిడ్ బాధితుల మోర్టాలిటీ ప్రిడిక్షన్ మోడల్‌ను హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. దేశం మొత్తం కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతోన్న వేళ.. పొదుపుగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ మోడల్ దోహదపడుతుందని ట్రిపుల్ ఐటీ పేర్కొంది. కొవిడ్ వైరస్ ఒక్కో వ్యక్తిలో ఓక్కో రకంగా ప్రభావం చూపుతోంది. చాలామందికి ఎటువంటి లక్షణాలు లేకుండా స్వల్ప ప్రభావంతో వ్యాధి నుంచి బయటపడుతుండగా... మరికొంత మంది సడన్‌గా సీరియస్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇంటెల్, సీఎస్ఐఆర్-ఐజీఐబీ సహకారంతో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మెషిన్ లర్నింగ్ మోడల్స్‌ను ఉపయోగించి కొవిడ్ రోగుల్లో రిస్క్ అండ్ మోర్టాలిటీ రేటును గుర్తించేందుకు పరిశోధనలు చేపట్టారు. ట్రిపుల్ ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ద్వారా కరోనా పాజిటివ్ అని తేలిన వారి మోర్టాలిటీ రేటును 90 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు క్లెయిమ్ చేస్తున్నారు.
దీని ద్వారా హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా బాధితుల చికిత్స మరింత సులభమవటమే కాక.. రిస్క్ ఫాక్టర్ ఎక్కువ ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించి వారి ప్రాణాలు నిలిపేందుకు వీలవుతుందని పరిశోధన సారాంశం. అయితే పరిశోధకులు యూఎస్, వుహాన్ బాధితుల రక్త నమూనాలు, శాంపిళ్లతో చేసిన ఈ పరిశోధన ఫలితాలు యూనివర్సల్‌గా ఏ మేరకు అప్లికేబుల్ అవుతాయో చూడాల్సి ఉంది. మరోవైపు కొత్త మ్యుటెంట్స్ పుట్టుకు రావటం, తద్వారా వేగంగా వైరస్ వ్యాప్తి, డీఎన్ఏలో మార్పులు వంటి అంశాల్లో మరింత డీప్ పరిశోధన అవసరమని నిపుణలు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ అనుమతి ఇస్తేనే శుభకార్యం!